కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:44 PM
పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఆదోనికి చెందిన ఆరుగురిని రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఆదోని రూరల్ మార్చి 3 : పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఆదోనికి చెందిన ఆరుగురిని రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆదివారం కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనాల్లో మద్యంను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఇస్వీ ఎస్.ఐ శ్రీనివాసులు, పెద్దతుంబళం ఎస్.ఐ పీరయ్య, సిబ్బందితో కలిసి సీఐ నీరంజన్ రెడ్డి నాగనాథనహళ్లి గ్రామ శివారులో దాడులు నిర్వహించారు. ఆదోనికి చెందిన దూద్‌పీరా, పీర్ సాబ్, షేక్షావలి, దిల్వార్ హుసేన్, మునిస్వామి, ఆంజి, లక్ష్మీనారాయణను అదుపులో తీసుకొని వీరి వద్ద నుంచి 34 బాక్సుల మద్యంతోపాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.