సీఎంఆర్‌ను గుడివాడ ప్రజలు ఆదరిస్తారు
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:03 AM
Kamineni and Venigandla Attend Shopping Mall Inauguration

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కామినేని, వెనిగండ్ల
గుడివాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గత వందేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం చూపిన వ్యక్తులు గుడివాడ పరిసర ప్రాంత వాసులేనని ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ 38వ షోరూమ్‌ను నిన్న వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ గుడివాడ ప్రజలు నిష్ణాతులని, నూతనంగా ప్రారంభించిన సీఎంఆర్ మాల్‌ను ప్రజలు ఆదరిస్తారన్నారు. గుడివాడకు మరిన్ని మాల్స్ రావాలని, దీంతో స్థానికులకు ఉపాధి దొరుకుతుందని వెనిగండ్ల ఆకాంక్షించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ తనకు సీఎంఆర్ షాపింగ్ మాల్‌తో మంచి అనుబంధం ఉందని, తానే 4 మాల్స్‌ను ప్రారంభించడం తన అదృష్టమన్నారు. ‘‘క’’ ఫేం నైనా సారిక మాట్లాడుతూ రూ.99 నుంచి పైస్ధాయి వరకు వస్త్రాలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయన్నారు. సీఎంఆర్ ఫౌండర్ అండ్ చైర్మన్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా ఒడిశాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 షోరూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. సీఎంఆర్‌లో షాపింగ్ చేస్తే ప్రపంచస్థాయి అనుభూతి కలుగుతుందన్నారు.