బ్రహ్మచారిణిగా కామేశ్వరీదేవి
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:28 AM
మహానందిలో కామేశ్వరీదేవి బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సింహ వాహనంపై అమ్మవారి విహారం
మహానంది, అక్టోబరు 4: మహానందిలో కామేశ్వరీదేవి బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మంటపంలో దాతలు, వేద పండితులు, రుత్వికులు, అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలతో పాటు కుంకుమార్చన పూజలను వేదమంత్రాలతో జరిపారు. సాయంత్రం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి సింహవాహానంపై బ్రహ్మచారి దుర్గను గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల్ల మధుతో పాటు సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు చంద్రఘంట దుర్గ అలంకరణ
మహానంది క్షేత్రంలో జరు గుతున్న దసరా దేవి శరన్న వరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం చంద్రఘంట దుర్గ అలంకా రంతో భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే రాత్రి మయూర వాహాన సేవ ఉంటుందన్నారు.