Share News

కమల వికాసం

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:29 AM

ఏపీలో 2019లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి రాష్ట్రంలో ఒక్క చోట కూడా డిపాజిట్లు దక్కలేదు. పైగా నోటా(1.28ు)కు వచ్చిన ఓట్ల కన్నా బీజేపీ(0.84ు)కి తక్కువ వచ్చాయి.

కమల వికాసం

అమరావతి: ఏపీలో 2019లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి రాష్ట్రంలో ఒక్క చోట కూడా డిపాజిట్లు దక్కలేదు. పైగా నోటా(1.28ు)కు వచ్చిన ఓట్ల కన్నా బీజేపీ(0.84ు)కి తక్కువ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తాజా ఎన్నికల్లో కూటమి కట్టి కమలం గుర్తుపై పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు లక్షల్లో మెజారిటీ సాధించారు. బీజేపీ తరఫున గత ఐదేళ్లలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రాష్ట్రంలో ఇప్పుడు ఏకంగా 8 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో కమల దళంలో సంబరం అంబరమంటుతోంది. రాజమహేంద్రవరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి 2.5 లక్షల మెజారిటీ సాధించారు. నరసాపురం పార్లమెంటు బరిలో దిగిన శ్రీనివాస వర్మ అంతకు మించి మెజారిటీ తెచ్చుకున్నారు. అనకాపల్లిలో పోటీ చేసిన సీఎం రమేశ్‌ రెండున్నర లక్షలకు పైగా మెజారిటీ సాధించారు.

Updated Date - Jun 05 , 2024 | 04:29 AM