Share News

కల్పవృక్ష.. హనుమద్‌ వాహనంపై సర్వాంతర్యామి

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:21 AM

తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలు వైన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటరమణ స్వామి వారు మంగళవారం ఉదయం కల్పవృక్షవా హనం, రాత్రి హనుమద్‌ వాహనంపై భక్తులను కటాక్షించారు. వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగుతు న్నాయి.

కల్పవృక్ష.. హనుమద్‌ వాహనంపై సర్వాంతర్యామి
కల్పవృక్ష వాహనంపై హనుమద్‌ వాహనంపై అభయమిస్తున్న సర్వాంతర్యామి

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 13: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలు వైన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటరమణ స్వామి వారు మంగళవారం ఉదయం కల్పవృక్షవా హనం, రాత్రి హనుమద్‌ వాహనంపై భక్తులను కటాక్షించారు. వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగుతు న్నాయి. బ్రహ్మోత్సవాల్లో బాగంగా టీటీడీ వేద పండితులు మంగళ వారం వేకువనే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాల సేవ, అర్చన, ప్రత్యేక పూజల. అనంతరం కల్పవృక్ష వాహ నంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు భక్తుల గోవిందనామస్మ రణలు, భజనల నడుమ ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. . రాత్రి దేవదేవుడు హనుమద్‌ వాహనం అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. స్వామి వారి వాహన సేవలను వీక్షించేం దుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఆలయ ఇనస్పెక్టర్‌ దిశంత కుమార్‌, ఉప ప్రఽధాన అర్చకులు కృష్ణప్రసా ద్‌ భట్టర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 12:22 AM