కదిరి వైసీపీలో క్యాంపు రాజకీయం
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:14 AM
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టించడం, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గెలుపొందడంతో వైసీపీలో గుబులు పట్టుకుంది. మున్సిపల్ చైర్మన సీటుకు గండం ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరుకు కౌన్సిలర్ల తరలింపు
కదిరి, జూన 10: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టించడం, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గెలుపొందడంతో వైసీపీలో గుబులు పట్టుకుంది. మున్సిపల్ చైర్మన సీటుకు గండం ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కదిరి మున్సిపాలిటీలోని పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి టచలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లను హుటాహుటిన బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి మగ్బుల్ వద్దకు కౌన్సిలర్లను తీసుకెళ్లినట్లు సమాచారం. తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పించడానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం తరువాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. మునిసిపల్ చైర్మన చాంబర్‌కు ఇప్పటికే కమిషనర్ తాళాలు వేశారు. చైర్‌పర్సన వచ్చినపుడు మాత్రమే తాళాలు తీస్తామని చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ వద్ద తాళాలుంటాయని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలుంటాయోనని పట్టణంలో చర్చ సాగుతోంది.