కడప జలమయం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:16 PM
జిల్లా కేంద్రమైన కడప నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి.

కడప జలమయం
జిల్లా కేంద్రమైన కడప నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని జిల్లా కోర్టు, ఆర్టీసీ బస్టాండు, చిన్నచౌకు, రైల్వేస్టేషన్‌రోడ్డు, శంకరాపురం, పాతబస్టాండు, హోమియోపతి కాలేజీ రోడ్డు ఇలా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. శంకరాపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లల్లోకే నీరు చేరింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యను ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని, ప్రస్తుతం వచ్చిన టీడీపీ ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
- కడప (ఎర్రముక్కపల్లె)