Share News

న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్‌ నరేందర్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:16 AM

ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేందర్‌ నియమితులయ్యారు.

న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్‌ నరేందర్‌

అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 22న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఇటీవల వరకు న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు పదవీ విరమణ చేయడంతో.. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ను ఆ పోస్టులో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Aug 24 , 2024 | 07:12 AM