త్రిపురాంతకంలో జస్టిస్ జ్యోతిర్మయి పూజలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 03:52 AM
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వరుడు, బాలాత్రిపురసుందరీదేవిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
త్రిపురాంతకం, జూలై 14: ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వరుడు, బాలాత్రిపురసుందరీదేవిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. జస్టిస్ జ్యోతిర్మయి దంపతులకు ఆలయ అర్చకులు శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.