Share News

జిల్లెళ్లమూడిలో జస్టిస్‌ దుర్గాప్రసాద్‌

ABN , Publish Date - May 19 , 2024 | 03:16 AM

బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.

జిల్లెళ్లమూడిలో జస్టిస్‌ దుర్గాప్రసాద్‌

అమ్మతో సంభాషణలు గ్రంథావిష్కరణ

బాపట్ల, మే 18: బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కల్యాణ మండపంలో కృష్ణయజుర్వేద నమఃఘనపారాయణం, తొమ్మిది మంది ఘనాపాటీలతో వేదపారాయణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ‘అమ్మతో సంభాషణలు’ గ్రంథాన్ని జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లెళ్లమూడి పుణ్యక్షేత్రానికి రావటం ఎంతో సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పది మందికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అన్నారు. అనంతరం జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ దంపతులను వేదపండితులు ఆశీర్వదించగా విశ్వజననీ పరిషత్‌ట్ర్‌స్టవారు సత్కరించారు.

Updated Date - May 19 , 2024 | 03:16 AM