వైసీపీ ఎమ్మెల్యేల్లో కనిపించని జోష్!
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:57 AM
సార్వత్రిక ఎన్నికల రూపంలో తమ భవిష్యత్ ఏమిటో అంచనావేస్తున్నందునో ఏమో అధికారపక్ష వైసీపీలో జోష్ కనిపించలేదు.
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల రూపంలో తమ భవిష్యత్ ఏమిటో అంచనావేస్తున్నందునో ఏమో అధికారపక్ష వైసీపీలో జోష్ కనిపించలేదు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఆద్యంతం జగన్మోహన్‌రెడ్డి పాలనను ప్రశంసిస్తూ సాగింది. కానీ అధికార సభ్యుల్లో జోష్ మాత్రం కనిపించలేదు. ఆనందంగా చప్పట్లు కొట్టిన, బల్లలు చరిచిన మోతా వినిపించలేదు. ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం, స్థానాలను మార్చేయడం వంటి కారణాల నేపథ్యంలో వీరంతా ముభావంగా సభలో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు చెన్నకేశరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, తిప్పేస్వామి తదితరులు అంటీముట్టనట్లు వ్యవహరించారు.