ఉమ్మడి జిల్లా గ్రామీణ స్థాయి బాల్‌బ్యాడ్మింటన పోటీలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:04 AM
నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1, 2 తేదీల్లో కొత్తపల్లి మండలం ఎర్రమటం గ్రామంలో దాతల సహకారంతో సీఎ్‌సఐ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా గ్రామీణ స్థాయి బాల్ బ్యాడ్మింటన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఎన.చిన్న నాగేశ్వరరావు, నరసింహులు, చిన్న వెంకటరమణ, సుఖ జీవనబాబు, బాలగోపాల్ రాజు సోమవారం తెలిపారు.

కొత్తపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1, 2 తేదీల్లో కొత్తపల్లి మండలం ఎర్రమటం గ్రామంలో దాతల సహకారంతో సీఎ్‌సఐ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా గ్రామీణ స్థాయి బాల్ బ్యాడ్మింటన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఎన.చిన్న నాగేశ్వరరావు, నరసింహులు, చిన్న వెంకటరమణ, సుఖ జీవనబాబు, బాలగోపాల్ రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 31 సాయంత్రంలోపు ఎంట్రీ ఫీజు రూ.300 చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన మొదటి విజేతకు రూ.10,016, రెండో విజేతకు రూ.7,016, మూడో విజేతకు రూ.5,016 నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామన్నారు. గ్రామస్థాయిలో మొదటి, రెండో, మూడో విజేతలకు రూ.5,016, రూ.3,016, రూ.2,016 అందజేయనున్నట్లు తెలిపారు.