Share News

శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:33 AM

శాసనసభ చీఫ్‌ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే (టీడీపీ) గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు (జీవీ ఆంజనేయులు) నియమితులయ్యారు.

శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు

మండలి చీఫ్‌ విప్‌గా అనురాధ

11 మంది టీడీపీ, ముగ్గురు జనసేన,

ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా చాన్స్‌

ఆరు కార్పొరేషన్లలో 90 మంది డైరెక్టర్ల నియామకం

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): శాసనసభ చీఫ్‌ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే (టీడీపీ) గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు (జీవీ ఆంజనేయులు) నియమితులయ్యారు. శాసన మం డలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధ (టీడీపీ) నియమితులయ్యారు. వీరితోపాటు శాసనభలో 11 మంది టీడీపీ, ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేను, కౌన్సిల్‌లో ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్సీని విప్‌లుగా ప్రకటించారు. శాసనసభలో విప్‌లుగా నియమితులైనవారిలో సి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు, బీజే పీ), అరవ శ్రీధర్‌(రైల్వే కోడూరు, జనసేన), బొలిశెట్టి శ్రీనివా్‌స(తాడేపల్లిగూడెం, జనసేన), బొమ్మిడి నారాయణ నాయకర్‌(నరసాపురం, జనసేన)లతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌(ఇచ్చాపురం), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్‌), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), యనమల దివ్య (తుని), వి.ఎం.థామస్‌ (గంగాధర నెల్లూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం), రెడ్డప్పగారి మాధవి (కడప), పీజీవీఆర్‌ నాయుడు-గణబాబు (విశాఖపట్నం పశ్చిమ), తంగిరాల సౌమ్య (నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం) ఉన్నారు. శాసనసభ చీఫ్‌ విప్‌గా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర పేరు ప్రచారం జరిగింది. ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అదే పూర్వపు గుంటూరు జిల్లాకు చెందిన జీవీ ఆంజనేయులును ఎంపిక చేశారు. విప్‌లలో నలుగురు రాయలసీమ, ముగ్గురు ఉత్తరాంధ్ర, 9 మంది కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందినవారు. ఇక, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించగా.. విప్‌లుగా వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌(టీడీపీ), పిడుగు హరిప్రసాద్‌(జనసేన)లను ప్రకటించారు. కాగా, ఆరు కార్పొరేషన్లు... కురుబ, కళింగ, వన్యకుల క్షత్రియ, శెట్టిబలిజ, ఆర్యవైశ్య, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది సభ్యుల చొప్పున మొత్తం 90 మందిని నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో రెండు పదవులు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించి, మిగతా డైరెక్టర్‌ పదవులను టీడీపీకి కేటాయించింది.

Updated Date - Nov 13 , 2024 | 05:33 AM