జగన్‌ది దగుల్బాజీతనం: వర్ల
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:16 AM
మోకాళ్లలోతు వరదలో చంద్రబాబు రాత్రీపగలు లేకుండా తిరిగి, బాధిత ప్రజలకు సాయం అందిస్తుంటే..
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మోకాళ్లలోతు వరదలో చంద్రబాబు రాత్రీపగలు లేకుండా తిరిగి, బాధిత ప్రజలకు సాయం అందిస్తుంటే.. ఆయనను విమర్శించడం జగన్ దగుల్బాజీ తనానికి నిదర్శనమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రోజుకి 22 గంటలు పని చేస్తూ, 2 గంటలే నిద్ర పోతున్న దార్శనికుడు చంద్రబాబును విమర్శించడానికి జగన్‌ది నోరా... తాటి మట్టా? బుడమేరు వరదలకు జగనే కారణం. దీనికి సమాధానం చెప్పే దమ్ము జగన్ ఉందా?’ అని వర్ల సవాల్ చేశారు. కాగా, వరద ప్రాంతాల్లో 8 రోజులుగా సీఎం, మంత్రులు ప్రజలకు అండగా నిలబడి తే.. బెంగళూరు ప్యాల్‌సలో కూర్చొని వరదలపై జగన్ చేస్తు న్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోందని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు. ఇంకా వైసీపీ తీరు మారకపోతే.. జగన్, ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయమని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.