Share News

మద్య నిషేధంపై మాటమార్చిన జగన

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:24 PM

మద్యనిషేధంపై మాటమార్చిన ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు కోల్పో యారని పీలేరు నియోజవర్గ జనసేన ఇనచార్జి బెజవాడ దినేశ ఆరో పించారు.

మద్య నిషేధంపై మాటమార్చిన జగన
కేవీపల్లెలో నాసిరకం మద్యం బాటిళ్లను చూపుతున్న జనసేన, టీడీపీ నాయకులు

ఫ జనసేన నియోజకవర్గ ఇనచార్జి దినేశ

పీలేరు, ఫిబ్రవరి 15: మద్యనిషేధంపై మాటమార్చిన ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు కోల్పో యారని పీలేరు నియోజవర్గ జనసేన ఇనచార్జి బెజవాడ దినేశ ఆరో పించారు. మద్యపాన నిషేధంలో జగన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జనసైనికులతో కలిసి ఆయన గురువారం కేవీపల్లెలో నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ మద్యనిషేధం చేసిన తరువాతనే ప్రజల ముందుకు ఓటు కోసం వస్తానని 2019 ఎన్నికల్లో జగన ప్రకటించారని దినేశ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యనిషేధం చేపట్టకుండా రానున్న పాతికేళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకుని సంపూర్ణ మద్యనిషేధానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. మద్యనిషేధం చేయనందు వల్ల ఆయన త్వరలో జరగనున్న ఎన్నికల నుంచి తప్పు కోవాలని దినేశ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయ కులు మహేశ, రెడ్డప్ప, అస్లం, ప్రభాకర్‌, పవన, గౌస్‌బాషా, కిశోర్‌, చిరంజీవి, అశోక్‌, గురుమూర్తి, రమణ, సాయికుమార్‌, నవీన, విశ్వ నాథ్‌, బావాజీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:24 PM