Share News

పులివెందుల్లోనే జగన్‌ సీటు చించుతారు: ప్రత్తిపాటి

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:05 AM

‘నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరు. అవినీతి సొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. పులివెందుల ప్రజలు ఈ దఫా జగన్‌ సీటు చించుతారు.

పులివెందుల్లోనే జగన్‌ సీటు చించుతారు: ప్రత్తిపాటి

‘నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరు. అవినీతి సొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. పులివెందుల ప్రజలు ఈ దఫా జగన్‌ సీటు చించుతారు. ఆ భయంతో జగన్‌ తాడేపల్లి ప్యాలె్‌సలో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు’ అని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మంగళగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబ్బు ఉందన్న అహంకారంతోనే జగన్‌ ఇన్నేళ్లు సొంతపార్టీ నేతలకు మొహం చూపించలేదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలనే కలవని వ్యక్తి ఇప్పుడు ‘సిద్ధం’ అంటూ కార్యకర్తల ముందుకొస్తే జగన్‌ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 09:59 AM