Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మోదీని వ్యతిరేకిస్తే జగన్‌ జైలుకే

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:53 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఏమాత్రం వ్యతిరేకించినా సీఎం జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

మోదీని వ్యతిరేకిస్తే జగన్‌ జైలుకే

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

కర్నూలు న్యూసిటీ, మార్చి 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఏమాత్రం వ్యతిరేకించినా సీఎం జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శనివారం కర్నూలులో జరిగిన ఉమ్మడి కర్నూలు జిల్లా సీపీఐ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జగన్‌ 11 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడన్నారు. జగన్‌ ఎక్కడ సమావేశాలు పెడితే అక్కడ చెట్లను నరికేస్తున్నాడన్నారు. సొంత చిన్నాన్నను చంపిన జగన్‌కు చెట్లు నరకడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ఉద్యోగులు పోరాటాలు చేస్తే అరెస్టు చేసి జైల్లో పెట్టడం జగన్‌కే సాధ్యమైందన్నారు. జగన్‌ నిజమైన నాయకుడైతే బందోబస్తు లేకుండా జనాల్లోకి రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Mar 03 , 2024 | 08:26 AM