Share News

ఎన్‌డీఏతో దోస్తీకి జగన్‌ తహతహ

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:15 AM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో దోస్తీ కోసం జగన్‌రెడ్డి తహతహలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

ఎన్‌డీఏతో దోస్తీకి జగన్‌ తహతహ

మరోవైపు ఉక్కు కార్మికుల ఓట్ల కోసం సరికొత్త డ్రామా: సీపీఐ

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో దోస్తీ కోసం జగన్‌రెడ్డి తహతహలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉక్కు కార్మికుల ఓట్ల కోసం సరికొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. గత 1200 రోజులుగా విశాఖ ఉక్కు కోసం ఉద్యమం కొనసాగుతుంటే పట్టించుకోని జగన్‌కి.. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల ఓట్లు కావాల్సి వచ్చాయా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న విషయం తనకు తెలియదని జగన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జత కట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీతోనే కాపురమంటూ జగన్‌ తన మనసులోని మర్మాన్ని ఇప్పటికే బయటపెట్టారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ పంచనే చేరడం ఖాయమని ప్రజలు గుర్తించాలని రామకృష్ణ కోరారు.

Updated Date - Apr 25 , 2024 | 07:21 AM