Share News

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి

ABN , Publish Date - May 02 , 2024 | 05:50 AM

నవరత్నాలు ఒట్టి హంబక్‌.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాకే ఎస్సీ,ఎస్టీలను ఓట్లడగండి..

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి

నవరత్నాలు ఒట్టి హంబక్‌.. నా ప్రశ్నలకు సమాధానం

చెప్పాకే ఎస్సీ,ఎస్టీలను ఓట్లడగండి.. షర్మిల బహిరంగ లేఖ

జగన్‌కు షర్మిల సంధించిన

నవ సందేహాలు ఇవీ..

1.ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా?

2.ఎస్సీ,ఎస్టీలకు సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?

3.ఎస్సీ,ఎస్టీల వివిధ పథకాలను ఎందుకు ఆపేశారు?

4.వెట్టి, జోగిని పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు ఆగింది?

5.విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు ఎందుకు తొలగించారు?

6.సిటింగ్‌ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి ఎందుకు టికెట్లివ్వలేదు?

7.ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరగడంపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం వాస్తవం కాదా?

8.దళిత డ్రైవర్‌ను హతమార్చి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు?

9.ఎస్సీ, ఎస్టీ యువతకు దన్నుగా ఉన్న స్టడీ సర్కిళ్లను ఎందుకు నిర్వీర్యం చేశారు?

Updated Date - May 02 , 2024 | 05:50 AM