‘దాడుల’పై జగన్ బాధ!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:13 AM
ఐదేళ్లు వైసీపీ శ్రేణులు అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా నోరు మెదపని ‘మాజీ ముఖ్యమంత్రి’ జగన్‌కు...

జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు వినతి
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు వైసీపీ శ్రేణులు అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా నోరు మెదపని ‘మాజీ ముఖ్యమంత్రి’ జగన్‌కు... అధికారం కోల్పోయిన రెండోరోజునే శాంతి భద్రతలు గుర్తుకొచ్చాయి. ‘మా వాళ్లపై దాడులు జరుగుతున్నాయి’ అని వాపోతూ గురువారం ఆయన ట్వీట్ చేశారు. తాము ఐదేళ్లపాటు కాపాడిన శాంతి భద్రతలు ఇప్పుడు చెల్లాచెదురయ్యాయని ఆక్రోశించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతి భధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’’ అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ‘ఫేక్’ దాడులు
‘‘గుంటూరు జిల్లా నుంచి అనంతపురం వెళ్లి... అక్కడి క్లాక్ టవర్ సెంటర్‌లో పరిటాల శ్రీరామ్‌కు సవాల్ విసిరి తొడగొట్టిన యువకుడి చెయ్యిని నరికేశారు’’ అంటూ గురువారం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది.