Share News

ఐదుగురి మరణాలకు జగనదే బాధ్యత

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:36 AM

మదనపల్లె మండలంలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెం దారని దీనికి సీఎం జగన బాధ్యత వహించాలని టీడీపీ శ్రేణు లు ధ్వజమెత్తారు.

ఐదుగురి మరణాలకు జగనదే బాధ్యత
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 26: మదనపల్లె మండలంలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెం దారని దీనికి సీఎం జగన బాధ్యత వహించాలని టీడీపీ శ్రేణు లు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక అన్నమయ్యసర్కిల్‌ వద్ద టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ మండలాధ్యక్షుడు దేవ రింటి శ్రీనివాసులు మాట్లాడుతూ జగన ప్రవేశపెట్టిన మద్యం తాగలేకనే మదనపల్లె ప్రాంత ప్రజలు సమీపంలోని కర్ణాటకకు వెళ్లి అక్కడ మద్యం తాగి వస్తూ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమయయ్యారన్నారు. అధికారంలోకి వస్తూ నే సంపూర్ణ మద్యనిషేథం తీసుకొస్తానని ప్రకటించిన సీఎం జగన మడమ తిప్పారన్నారు. జే బ్రాండ్‌ మద్యంతో కుటుంబా లు గుల్లలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కత్తి లక్ష్మిన్న, క్లస్టర్‌ ఇనచార్జి మేకలరెడ్డిశేఖర్‌, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

జాతరలో టీడీపీ బ్యానర్లు ధ్వంసం

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 26: సార్వత్రిక ఎన్నికలు ఇంకా రాలే దు కాని గ్రామాల్లో రాజకీయ విద్వేషాలు ప్రారంభమయ్యాయి. మదనపల్లె మండలం సీటీఎం గంగ జాతర సందర్భంగా టీడీ పీ, జనసేన, వైసీపీ పార్టీల నాయకులు ప్రజలకు, నాయకులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు కట్టారు. ఈ క్రమంలో సీటీఎం వాస్తవ్యుడైన మదనపల్లె మండల టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్రాస్‌రోడ్డు, సీటీఎం వద్ద మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ, చంద్రబాబు, లోకేశ చిత్రా లతో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈ బ్యానర్లు అన్నింటిని ధ్వంసం చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రశాంతగా వున్న గ్రామాల్లో కొందరు అధికార పార్టీ నాయకులు ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగి రెచ్చగొడుతున్నారని, దీనిపై మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:36 AM