జగన్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మాత్రమే
ABN , Publish Date - Jun 27 , 2024 | 02:06 AM
రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,

ప్రతిపక్ష హోదా కోరుతూ రాద్దాంతం తగదు: పల్లా
రేపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
గాజువాక, జూన్ 26, అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కేవలం 11 స్థానాలు గెలిచిన జగన్.. శాసనసభలో ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే కొనసాగాలని అసెంబ్లీ నిబంధనలు చెబుతున్నాయని చెప్పారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన పల్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.