Share News

జగన్‌... దమ్ముంటే పాత, కొత్త మేనిఫెస్టోలను కలిపి రిలీజ్‌ చేయి: నాదెండ్ల

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:13 AM

కేవలం ఎన్నికల కోసం, మళ్లీ జనాన్ని మోసం చేసేందుకు జగన్‌రెడ్డి కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను,

జగన్‌... దమ్ముంటే పాత, కొత్త మేనిఫెస్టోలను కలిపి రిలీజ్‌ చేయి: నాదెండ్ల

తెనాలి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కేవలం ఎన్నికల కోసం, మళ్లీ జనాన్ని మోసం చేసేందుకు జగన్‌రెడ్డి కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను, ఈ ఎన్నికల మేనిఫెస్టోను పక్కపక్కన పెట్టి ఒకే పేజీతో జనం ముందుకు రాగలవా? అలా విడుదల చేసే దమ్ము నీకుందా జగన్‌రెడ్డీ?’ అంటూ జనసేన పీఏసీ చైౖర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సవాల్‌ విసిరారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మనోహర్‌ వైసీపీ మేనిఫెస్టోపై స్పందించారు. ‘గత ఎన్నికలప్పుడు నవరత్నాలన్నీ ఒకే పేజీ మేనిఫెస్టోగా విడుదల చేశానని గొప్పగా చెప్పిన జగన్‌... ఈ సారి ఏక పత్రాన్ని కాకుండా 3 పేజీల మేనిఫెస్టోను ఎందుకు విడుదల చేశారు? నిజాయతీగా పాలించిన వ్యక్తయితే గతంలో చేసిన హామీలు, ఈ హామీలను పక్కపక్కన పెట్టి సింగిల్‌ పేజీ రిలీజ్‌ చేయాలి. జనం ఈ సారి మోసపోరు. కచ్చితంగా ఇంటికి పంపుతారు. మా కూటమి అధికారంలోకి వస్తుంది’ అన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 08:33 AM