రాష్ట్రం పరువు తీసిన జగన్: సీపీఐ
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:21 AM
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం పరువు తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
అమరావతి, మాఅమరార్చి 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం పరువు తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. వివిధ ప్రభుత్వ విభాగాల ఆస్తులను ఇప్పటికే తనఖా పెట్టి అందినకాడికి అప్పులు తెచ్చిన జగన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టడం దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని దాదాపు రూ.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం.. రూ. 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. అంత డబ్బు జగన్ ప్రభుత్వం దగ్గర ఉంటే ఏపీ సెక్రటేరియట్ భవనాలను హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి’ అని రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సీరియ్‌సగా లేదని రామకృష్ణ అనంతపురంలో ఆక్షేపించారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ తన ఓటు సొంతూరులో నమోదు చేసుకునేందుకు మూడేళ్లు కష్టపడ్డారంటే.. పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కరలేదన్నారు.