Share News

నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టింది బీవీ కుటుంబమే

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:08 AM

దశాబ్ధాల కాలంగా ఎమ్మిగనూరులో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టింది బీవీ కుటుంబమని టీడీపీ బీసీసెల్‌ నాయకులు అన్నారు.

నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టింది బీవీ కుటుంబమే

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 26: దశాబ్ధాల కాలంగా ఎమ్మిగనూరులో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టింది బీవీ కుటుంబమని టీడీపీ బీసీసెల్‌ నాయకులు అన్నారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వీజీఏ దయాసాగర్‌, కౌన్సిలర్‌ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు ముల్లా కలీముల్లా, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్‌, చేనేత మల్లి, అంజి, దేవేంద్ర, బిజ్జె నాగరాజు, మిన్నప్ప మాట్లాడారు. ఎమ్మిగనూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు బీవీ వెంటే ఉంటామని, ఎన్ని ట్రిక్కులు చేసినా టీడీపీ టికెట్టు బీవీ జయనాగేశ్వరరెడ్డికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నందవరం, ఫిబ్రవరి 26: మండల కేంద్రంలో జయహో బీసీ కార్యమ్రాన్ని టీడీపీ మండల ఆధ్యక్షుడు డీవీ రాముడు ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముగతి ఈరన్న గౌడు, మాచాపురం కాశీంవలీ, ధర్మాపురం గోపాల్‌, గురురాజారావు మాట్లాడుతూ బీవీకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగ్గాపురం నరసింహాలు, నాగలదిన్నె ఈరన్న, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు బాపురం బద్రినీలకంఠ, నదికైరవాడి వీరేష్‌ ఆదిశేషు పాల్గొన్నారు.

గోనెగండ్ల : బీవీ జయనాగేశ్వరరెడ్డి వైపే బీసీలు ఉన్నారని ఆయన విజయానికి కృషి చేస్తారని గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు అన్నారు. సోమవారం బీసీ నాయకులుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గాజులదిన్నె హనుమంతు, బేతాలబడేసా, గంజహళ్లి కృష్ణమనాయుడు, మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, ప్రధానకార్యదిర్శి తిరుపతయ్యనాయుడు, టౌన్‌ అధ్యక్షుడు రమేష్‌నాయుడ, రంగస్వామినాయుడు మాట్లాడుతూ బీసీ జయనాగేశ్వరరెడ్డి గ్రామాల్లో బీసీ లకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కారం చూపుతారని అన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:08 AM