Share News

‘కొల్లే’ గొట్టేస్తున్నాడు

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:33 AM

అభివృద్ధి మాటున అక్రమాస్తులు పోగుపడుతున్నాయి. జగనన్న కాలనీల్లో ధరల మతలబులు, పూడిక పనుల్లో పైసా వసూళ్లు, కొల్లేరు తవ్వకాల్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన అడుగడుగునా అవినీతి తాండవమాడుతోంది.

‘కొల్లే’ గొట్టేస్తున్నాడు

చట్టాలు, కోర్టుల కంట్లో ‘దూలం’ పెట్టి సొంత జాగీరులా నియోజకవర్గం నియోజకవర్గంలో ఎందుకూ పనికిరాని చెరువు భూములు తక్కువకు కొని జగనన్న కాలనీల కోసం రెట్టింపు రేటుకు ప్రభుత్వానికి అంటగట్టారు. అక్కడితో అయిపోలేదు. ఆ చెరువు భూములను పూడ్చడానికి అవసరమైన మట్టి పనులూ సదరు నేతే తన చేతుల్లోకి తీసుకున్నారు. పూడిక పనుల కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు కేటాయించింది. బుసకను (మట్టి) తోలే కాంట్రాక్టును వైసీపీకి చెందిన ఒక నాయకుడికి రూ.10 లక్షలకు ఎమ్మెల్యే కుమారుడు అప్పగించగా, మరో బుసక తోలకందారుడికి రూ.7 లక్షలకు అతడు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు సమాచారం. రోజుకు 200 టిప్పర్ల బుసకను తరలించారు.

ఒక్కో ట్రిప్పునకు రూ.2 వేల చొప్పున తండ్రీకొడుకు దండుకున్నారు.

కొల్లేరు భూముల్లో కొబ్బరికాయ కొట్టి మరీ

అక్రమ తవ్వకాలు ప్రారంభించిన ఘనుడు

ఏలూరు జిల్లాలోని ఆ అడ్డాలో ప్రతి పనికీ కప్పం

రైతులవి అక్కడ నయా బానిస బతుకులు

తమ చెరువుల్లో మట్టి తీసుకోడానికి లేదు

జగనన్న కాలనీలకోసం వాటినుంచే మట్టి

చెరువు భూములను కాలనీ కోసం కొనిపించారు

చౌకగా వాటిని కొని రెట్టింపు ధరకు విక్రయం

అక్కడ పూడిక పనుల్లో భారీగా హస్త లాఘవం

ఎడా పెడా రూ.200 కోట్లకు పైగా అక్రమార్జన!

(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

అభివృద్ధి మాటున అక్రమాస్తులు పోగుపడుతున్నాయి. జగనన్న కాలనీల్లో ధరల మతలబులు, పూడిక పనుల్లో పైసా వసూళ్లు, కొల్లేరు తవ్వకాల్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన అడుగడుగునా అవినీతి తాండవమాడుతోంది. ఎవరు చేస్తున్నారు. ఎక్కడ, ఏమిటా కథ అంటారా? అలా అయితే ఏలూరు జిల్లాలోని ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని సందర్శించాల్సిందే. ఆయన నియోజకవర్గంలో రైతులకు తమ చేపలచెరువులోని బుసకను విక్రయించుకునే స్వేచ్ఛ కూడా లేదు. కొల్లేరు భూముల్లో సాగును ప్రభుత్వం రద్దు చేసిందని తెలిసినా, కొబ్బరికాయ కొట్టి మరీ అక్రమ తవ్వకాలను ప్రారంభించిన ఘటికుడు ఆయన ఇదొక్కటే కాదు, చట్టం కంట్లో ‘డూలమే’ పెట్టేసి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గంలో ఏ పనికయినా ముందే రేటు ఫిక్స్‌ అయ్యుంటుంది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు దీనికోసం ప్రత్యేక శాసనమే చేసి అమల్లోపెట్టారు. అడిగీతే అరదండాలు, ప్రశ్నిేస్త పోలీసుల వేధింపులు అంటూ ప్రశాంతంగా బతికే ేస్వచ్ఛను తండ్రీకొడుకులు హరిస్తున్నారు. ఉదాహరణకు కేౖకలూరులో అట్టహాసంగా ప్రారంబిం చిన జగనన్న కాలనీల కోసం సుమారు వంద ఎకరాల భూమిని ేసకరించాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. ఆ ఎమ్మెల్యే తన తెలివితేటలను ఉపయోగీంచి, పట్టణంలో చేపల చెరువు గల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ ఎకరం రూ. 10 లక్షలు ఉంది. అయితే అప్పటికే రికార్డుల్లో బి-ఫామ్‌ పట్టాగా అక్కడి భూములు నమోదయి ఉన్నాయి. ఆయా యజమానులు తమ తమ అవసరాల దృష్ట్వా అనధికారికంగా వాటిని విక్రయించుకునేవారు. ఆ భూమ స్థలు అయితే తక్కువ ధరకు తీసుకోవచ్చని ఆ నేత ఆలోచించారు. అవే భూముల్లో జగనన్న కాలనీ ఏర్పాటుచేేసలా అధికారుల ద్వారా పావులు కదిపారు.

ఆ భూమంతా చేపల చెరువులుగా ఉండటంతో పూడికల నిమిత్తం అధికారులు తర్వాతి రోజుల్లో రూ. కోట్లల్లో నిధులను కూడా కేటాయించారు. కాగా అప్పటికే బీఫారం పట్టా ఉన్న ఆ భూములను రైతుల నుంచి ఎకరా కేవలం రూ.25 లక్షల చొప్పున బెదిరించి కొనుగోలు చేశారు. అనంతరం అదే భూమ లను అసలు మార్కెట్‌ రేటు ప్రకారం రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. అక్కడితో తృప్తి పడలేదు. జగనన్న లే-అవుట్ను ఆనుకుని ఉన్న సుమారు మరో 60 ఎకరాల పైనా వారి కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఆ భూములను బినామీల పేర్లతో ముందస్తుగా కొనుగోలు చేశారు. అధికార బలంతో రైతులను బెదిరించి రూ. 40 లక్షలు పలుకుతున్న ఒక్కో ఎకరాను రూ.25 లక్షల చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేశారని చెబుతారు.

తోలకం మామూలుగా లేదుగా!

చేపల చెరువుల్లో ఉండే బుసకను లేఅవుట్లు, రోడ్లు, ఇళ్ల నిర్మాణాల్లో మెరక వేసేందుకు ఉపయోగీస్తుంటారు. అయితే ఏ రైతు కూడా తన చెరువుల్లోని బుసకను అతనికి నచ్చినట్లుగా విక్రయించుకునే ేస్వచ్ఛ ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా బుసక తవ్వకాలను తండ్రీకొడుకులే పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులను వైసీపీలోని ముఖ్య అనుచరులకు అప్పగీంచి వారినుంచి కమీషన్లు పడుతున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు జగనన్న లే-అవుట్‌ పూడిక పనుల కోసం రూ.40 లక్షలు కేటాయించాలంటూ అధికారులు అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. దీనికి అవసరమైన బుసకను తోలే కాంట్రాక్టును వైసీపీకి చెందిన ఒక నాయకుడికి రూ.10 లక్షలకు ఎమ్మెల్యే కుమారుడు కాంట్రాక్ట్‌ ఇవ్వగా, అతడు, మరో బుసక తోలకం దారుడికి రూ.7 లక్షలకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చినట్టు సమాచారం. నిత్యం రోజుకి 200 టిప్పర్ల బుసకను పలు ప్రాంతాలకు అప్పట్లో తరలించారు. కాంట్రాక్టు డబ్బు కాకుండా ఒక్కో టిప్పరు నుంచి రూ.2వేలను తండ్రీకొడుకులు దండుకున్నారు. ఈ దందాలో ఏటా కోట్ల రూపాయలను ఈ ధ్వయం మింగేస్తోంది. మ ఖ్యంగా నవంబరు నుంచి ఆగస్టు వరకు బుసక తవ్వకాలు భారీగా సాగుతున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే ఏదేని ఒక రైతు తన చేపలచెరువును మరమ్మతు చేసుకోవాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. నియోజకవర్గం పరిధిలో 45 కిలో మీటర్ల మేర జరుగుతున్న 165వ జాతీయ రహదారి విస్తరణ పనులకు అవసరమైన బుసక కాంట్రాక్టు పనులు కూడా ఆ ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తే చేపడుతున్నారు.

కొల్లేరుపై గునపం

కొల్లేరులో అక్రమ చేపలచెరువుల తవ్వకాలు అడ్డగోలుగా పెరిగీపోయాయి. కొల్లేరులో చేపల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని భావించే రైతులు సాగు కోసం పోటీపడుతుంటారు. ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల నుంచి భారీగా ముడుపులు అందుకొని ఈ చెరువులను ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి తవ్విస్తున్నారు. వారి అండతో తండ్రీకొడుకులు చెలరేగీపోతున్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలోనూ అక్రమ తవ్వకాలు సాగీస్తున్నారు. అం దులో రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారుల హస్తం కూడా ఉందన్నది బహిరంగ రహస్యమే. వందలాది ఎకరాలను అక్రమంగా తవ్వకాలు చేయిస్తూ, తవ్విన చేపలచెరువులను అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు అనధికారిక లీజులకు కేటాయిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:33 AM