Share News

నిర్లక్ష్యం నీడలో సాగునీటి ప్రాజెక్టులు

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:43 PM

పీలేరు నియోజకవర్గంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించిన అడవిపల్లె, ఝరికోన ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

నిర్లక్ష్యం నీడలో సాగునీటి ప్రాజెక్టులు
జిల్లేళ్లమందలో వ్యవసాయ కూలీలతో మాట్లాడుతున్న నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, మార్చి 1: పీలేరు నియోజకవర్గంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించిన అడవిపల్లె, ఝరికోన ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కేవీపల్లె మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ పరిధిలో శుక్రవారం టీడీపీ, జనసేన శ్రేణు లతో కలిసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపల్లె మండల ప్రజల కోసం తన అన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా నాయకులు, ప్రజలతో విభేధించి మరీ ఝరికోన ప్రాజెక్టు నిర్మించామని గుర్తు చేశారు. కేవీపల్లె, కలకడ, కలికిరి మండలాలకు తాగునీరు, కేవీపల్లె మండలంలోని గ్రామాలకు సాగునీటి కోసం నిర్మిం చిన ఆ ప్రాజెక్టు నిర్వహణ లేకపోడంతో పైపులైన్లు శిథిలావస్థకు చేరు కున్నాయని వాపోయారు. పీలేరు నియోజకవర్గంలోని సుమారు 70 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు హంద్రీ-నీవా పథకంలో భాగంగా అడవిపల్లె వద్ద రిజర్వాయర్‌ను నిర్మించామని గత ప్రభు త్వంలో పనులన్నీ పూర్తయినప్పటికీ వైసీపీ నాయకులు కుట్రలు, కుతం త్రాల కారణంగా అది ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలు తప్ప అభి వృద్ధి ఊసే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో ప్రకటిం చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో కూడిన కరపత్రాలను పంచుతూ ఆయన జిల్లేళ్లమంద పంచాయతీలోని దేవాండ్లపల్లె, జిల్లేళ్లమంద తాండా, నగరి, శెట్టిపల్లె, వడ్డిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ ఉయదశ్రీ, కేవీపల్లె మండల పార్టీ అధ్యక్షురాలు గీతాంజలి, రాజంపేట పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి రవిచంద్రారెడ్డి, గాలి సుధాకర్‌ నాయుడు, మహేంద్ర రెడ్డి, కంకడ్టర్‌ రమణ, కంచి సూరి, ప్రసాద్‌రెడ్డి, శేషాద్రి నాయుడు, మౌలా, రెడ్డిశేఖర్‌, రహంతుల్లా, రంజిత, రెడ్డప్పరెడ్డి, ‘సంఘం’ శివారెడ్డి, వెంకీ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:43 PM