బయటి వ్యక్తుల ప్రమేయం సహించం
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:18 AM
డోన రైల్వే యూనియన ఎన్నికల్లో బయటి వ్యక్తుల ప్రమేయం సహించమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రామాంజనేయులు
డోన రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): డోన రైల్వే యూనియన ఎన్నికల్లో బయటి వ్యక్తుల ప్రమేయం సహించమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు అన్నారు. డోన రైల్వే ఉద్యోగి విజయకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం డోన రైల్వే స్టేషన వద్ద సీపీఐ నాయ కులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, మోటరాముడు మాట్లాడారు. రైల్వే ఉద్యోగుల యూనియన ఎన్నికల్లో బయటి వారి జోక్యం నివారించాలన్నారు. రైల్వే ఉద్యోగి విజయకృష్ణపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.