పీలేరు పంచాయతీ నిధుల వ్యయంపై విచారణ
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:12 PM
పీలేరు గ్రామ పంచా యతీలో నిధులు దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టారు.

పీలేరు, జూలై 5: పీలేరు గ్రామ పంచా యతీలో నిధులు దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టారు. మద నపల్లె డీఎల్‌పీవో నాగరాజ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందానికి జిల్లా కలెక్టర్, డీపీవోలు ఆ బాధ్యత అప్పగిం చారు. అందులో భాగంగా ఐదుగురు అధికారుల బృందం శుక్రవారం నుంచి తమ పని ప్రారంభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇటీవలి కాలం వరకు పీలేరు పంచాయతీకి మంజూరైన నిధులు, వాటి వ్యయంపై వారు దృష్టి సారించారు. మదనపల్లె డీఎల్‌పీవో నాగరాజు బృంద నాయకుడిగా వ్యవహరిస్తుండగా కలికిరి మండ ల ఈవోపీఆర్‌ఆర్‌డీ పరశురాం, నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి హరి, మదనపల్లె డీఎల్‌పీవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్లు ఉదయ్ కిరణ్, నవీన రాజు సభ్యు లుగా ఉన్న ఈ బృందం పీలేరు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో ఉన్న రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
పంచాయతీలో అవినీతిపై టీడీపీ దృష్టి
పీలేరు పంచాయతీ పాలన వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి అనేక అవినీ తి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వాటిపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి నిర్ణయించుకుని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు మదనపల్లె డీఎల్‌పీవో నేతృత్వంలో ఐదుగురు అధికారులను జిల్లా ఉన్నతాధికారులు నియమించా రు. వారి విచారణలో ఎటువంటి వాస్తవాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి.