Share News

పర్యాటకశాఖలో ఫైళ్ల మాయంపై విచారణ

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:35 AM

పర్యాటక శాఖలో ఫైళ్ల మాయం ఉదంతంపై రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ విచారణకు ఆదేశించారు.

పర్యాటకశాఖలో ఫైళ్ల మాయంపై విచారణ

కార్యాలయాలకు వెళ్లి నివేదిక కోరిన రజత్‌ భార్గవ

విజయవాడ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖలో ఫైళ్ల మాయం ఉదంతంపై రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ విచారణకు ఆదేశించారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘పర్యాటక శాఖ ఫైల్స్‌ మాయం’ కథనంపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ), ఆంధ్రప్రదేశ్‌ టూరి జం అథారిటీ (ఏపీటీఏ)ల కార్యాలయాలకు వెళ్లి పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఈడీ(అడ్మినిస్ర్టేషన్‌)ని ఆదేశించారు. కాగా, పర్యాటక శాఖకు చెందిన ఎలాంటి ఫైల్స్‌ మాయం కాలేదని ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆయన స్పందించారు. ఆ సమయంలో తాను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నానని, ఆఫీసు సిబ్బంది ఎవరూ తనను కలవలేదని తెలిపారు. ఫైల్స్‌ మాయం అనేది లేదని చెప్పారు.

Updated Date - Jun 08 , 2024 | 07:29 AM