Share News

అర్హులైన అధికారులకు అన్యాయం

ABN , Publish Date - May 26 , 2024 | 02:04 AM

అర్హులైన అధికారులకు అన్యాయం చేసి తమ చెంచాలను ఐఏఎ్‌సలుగా ఎంపిక చేయించుకోవడానికి ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి ఉమ్మడి కుట్రకు తెరలేపారని టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

అర్హులైన అధికారులకు అన్యాయం

జవహర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డిలపై దేవినేని ఉమా ఫైర్‌

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): అర్హులైన అధికారులకు అన్యాయం చేసి తమ చెంచాలను ఐఏఎ్‌సలుగా ఎంపిక చేయించుకోవడానికి ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి ఉమ్మడి కుట్రకు తెరలేపారని టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐఏఎస్‌ నియామకాల నోటిఫికేషన్‌ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. సమయం తగ్గించారు. ఆఘమేఘాలపై జాబితా తయారు చేయించారు. పోయిన సంవత్సరం దరఖాస్తు చేసుకొన్న వారి పేర్లు మళ్లీ ఈ ఏడాది జాబితాలో పెట్టించారు. సీఎం జగన్‌పై స్వామి భక్తితో జవహర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఈ వ్యవహారం నడిపించారు. దీనిపై మీడియాలో వార్తలు వస్తే కుక్కిన పేను మాదిరి చలనం లేకుండా ఉన్నారు. ప్రభుత్వం మారిపోతుందేమోనన్న భయంతో ఫలితాలు రావడానికి ముందే ఈ ఎంపికలు చేయించుకోవాలని హడావుడి పడుతున్నారు. అందుకే వీటి ఎంపికలు నిలుపు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాయాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పారు. డీడీ కేడర్‌లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేయాలని నిబంధనలు చెబుతుంటే గడికోట మాధురిరెడ్డికి రెండేళ్ల సర్వీసు మాత్రమే ఉన్నా ఎంపికచేయించాలని చూస్తున్నారని అన్నారు.

Updated Date - May 26 , 2024 | 07:41 AM