Share News

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:13 AM

వేసవి ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. విద్యుత్తు వాడకమూ అంతే స్థాయిలో ఉంటోంది. సగటున రోజుకు 250 మిలియన్‌ యూనిట్లదాకా విద్యుత్తు డిమాండ్‌ ఉంటోంది.

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వేసవి ఉష్ణోగ్రతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. విద్యుత్తు వాడకమూ అంతే స్థాయిలో ఉంటోంది. సగటున రోజుకు 250 మిలియన్‌ యూనిట్లదాకా విద్యుత్తు డిమాండ్‌ ఉంటోంది. గురువారం 249.779 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైంది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ నుంచి 211.218 మిలియన్‌ యూనిట్ల మేర సమీకరించారు. మరో 38.561 మిలియన్‌ యూనిట్ల లోటు ఏర్పడింది. 39.779 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో రూ.26.775 కోట్లకు కొనుగోలు చేశారు. మరోవైపు థర్మల్‌ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 07:56 AM