పెరిగిన వేడి
ABN , Publish Date - Mar 01 , 2024 | 03:30 AM
: శీతాకాలం ముగియడంతో వేసవి వేడి తీవ్రత మొదలైంది. ఐదారు రోజుల నుంచి రాయలసీమలో కొనసాగుతున్న వేడి వాతావరణం గురువారం కోస్తాకు విస్తరించింది. అయితే ఉదయం నుంచి కోస్తాలో పలుచోట్ల దట్టంగా మంచుకురిసింది. తరువాత
కర్నూలులో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): శీతాకాలం ముగియడంతో వేసవి వేడి తీవ్రత మొదలైంది. ఐదారు రోజుల నుంచి రాయలసీమలో కొనసాగుతున్న వేడి వాతావరణం గురువారం కోస్తాకు విస్తరించింది. అయితే ఉదయం నుంచి కోస్తాలో పలుచోట్ల దట్టంగా మంచుకురిసింది. తరువాత మంచుతెరలు తొలగిపోవడంతో సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో ఉక్కపోతతోపాటు ఎండ తీక్షణంగా కాసింది. రాయలసీమలో రాత్రి సమయంలో కూడా వేడి వాతావరణం కొనసాగింది. నైరుతి దిశగా వీచిన పొడిగాలులతో రాయలసీమలో గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోవడంతో మరింత వేడి నెలకొంది. గురువారం కర్నూలులో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.