Share News

వసతులు మెరుగుపర్చండి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:27 PM

నందలూరు రైల్వే కేంద్రంలోని లోకో పైలె ట్లు, అసిస్టెంట్‌ లోకో పైలెట్లు, ట్రైన్‌ మేనేజర్లకు వసతి కల్పించే రన్నింగ్‌ రూమ్‌ లో సౌకర్యాలు మెరుగు పరచాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పి.డి మిశ్రా సిబ్బందికి సూచించారు.

వసతులు మెరుగుపర్చండి
రన్నింగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పీడీ మిశ్రా

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పి.డి.మిశ్రా

నందలూరు, ఫిబ్రవరి 15: నందలూరు రైల్వే కేంద్రంలోని లోకో పైలె ట్లు, అసిస్టెంట్‌ లోకో పైలెట్లు, ట్రైన్‌ మేనేజర్లకు వసతి కల్పించే రన్నింగ్‌ రూమ్‌ లో సౌకర్యాలు మెరుగు పరచాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పి.డి మిశ్రా సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన స్థానిక రైల్వే కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రన్నింగ్‌ రూములో కేవలం 35 మంచాలు ఉండటం వల్ల రన్నింగ్‌ స్టాఫ్‌కు అసౌకర్యంగా ఉందని, మరో 10 బెడ్స్‌ ఏర్పాటు కోసం గదులు నిర్మించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్దిగాంచిన, చారిత్రాక, నందలూరు సౌమ్యనాథస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈయన వెంట సీనియర్‌ డీఈఈ/టీఆర్‌డీ సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ డీఈఈ/టీఆర్‌ఎ్‌సవో వీరయ్య, స్టేషన్‌ మేనేజర్‌ కమలాకర్‌, ఎస్‌ఎ్‌సఈ/టీఆర్‌డీ వినోద్‌కుమార్‌, ఎలక్ట్రికల్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ విజయకుమార్‌, సీసీ వేణుగోపాల్‌, సీఎల్‌ఐ పెంచలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:27 PM