Share News

రాజకీయ ఒత్తిళ్లతోనే అక్రమ కేసులు : ఎమ్మార్పీఎస్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:06 AM

ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో కరపత్రాలు విడుదల చేస్తే రాజకీయ ఒత్తిళ్లతో తమపైన అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందిమడుగుల రమేష్‌ మాదిగ అన్నారు.

రాజకీయ ఒత్తిళ్లతోనే అక్రమ కేసులు : ఎమ్మార్పీఎస్‌

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 7: ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో కరపత్రాలు విడుదల చేస్తే రాజకీయ ఒత్తిళ్లతో తమపైన అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందిమడుగుల రమేష్‌ మాదిగ అన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్‌ఎస్‌ బృందం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐని కలిసి తమపై అక్రమకేసులు పెట్టడం తగదన్నారు. అక్రమ కేసులు పెట్టించిన ఆర్‌అండ్‌బీ అధికారులపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐకి వారు ఫిర్యాదు చేశారు.కేవలం రాజకీయ కక్షతోనే ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డు పెట్టుకుని నాయకులు తనపైన అక్రమ కేసులు బనాయించారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 08 , 2024 | 12:07 AM