Share News

ఽచదువుకోమంటే.. చచ్చిపోయారు..!

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:44 PM

ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బడికి వెళ్లకపోవడం, సెల్‌ఫోన చూస్తూ గడపడంతో తల్లిదండ్రులు మందలించినందుకు ఇద్దరు, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు

ఽచదువుకోమంటే.. చచ్చిపోయారు..!

దర్మవరం/రొద్దం/తాడిపత్రి టౌన, ఏప్రిల్‌ 13: ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బడికి వెళ్లకపోవడం, సెల్‌ఫోన చూస్తూ గడపడంతో తల్లిదండ్రులు మందలించినందుకు ఇద్దరు, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫ బడికి వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఐదో తరగతి విద్యార్థి నాగ చైతన్య(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ డ్రైవర్‌ రంగప్ప, శ్రీదేవి దంపతుల కుమారుడు నాగచైతన్య ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. బడికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు.. శనివారం ఇంట్లో ఫ్యానకు చీరతో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేలోగా మృతిచెందాడు. టూటౌన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫ సెల్‌ఫోన వాడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థిని నందిని(14) ఆత్మహత్య చేసుకుంది. రొద్దం మండలం కె.మరువపల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. తన దత్త పుత్రిక నందిని ఎక్కువగా సెల్‌ఫోన చూస్తూ గడుపుతుండటంతో కుళ్లాయప్ప మందలించారు. పరీక్షల సమయంలో ఇలా మొబైల్‌ చూడటం మంచి పద్ధతి కాదని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన నందిని ఇంట్లో చీరతో ఉరివేసుకుంది. తల్లి కమలమ్మ ఆ సమయంలో స్నానానికి వెళ్లారు. తండ్రి తిరిగి వచ్చేలోగా నందిని ఉరికి వేలాడుతూ కనిపించింది. కిందకు దించి ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు తెలిపారు. నందిని పైడేటి జిల్లాపరిషత పాఠశాల విద్యార్థిని. ఫ ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలవుతానన్న భయంతో ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఇందు (16) ఆత్మహత్య చేసుకుంది. కానీ ఫలితాలు వచ్చాక ఆమె పాసైనట్లు తేలింది. ఈ విషాద ఘటన తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, వరలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు సంతానం. రెండో కూతురు ఇందు అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఫెయిల్‌ అవుతానన్న భయంతో, ఫలితాలు రాకమునుపే శుక్రవారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురం తరలించారు. కోలుకోలేక శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో ఇందు 289 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రూ.51.27 లక్షల సీజ్‌(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎలాంటి రసీదులు, బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న నగదును అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఈ రెండు జిల్లాలో మొత్తం రూ.51.27 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లులో రూ.2.50లక్షల నగదును సీజ్‌ చేసినట్లు వనటౌన సీఐ రామసుబ్బయ్య తెలిపారు. ఆలూరు రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టామన్నారు. గుంతకల్లు మండలం సంఘాల గ్రామానికి చెందిన ఎస్‌ రామాంజనేయులు ఆదోని నుంచి కారులో నగదును తీసుకెళ్తున్నాడన్నారు. రైల్వే బ్రిడ్జివద్ద వాహనాలు తనిఖీలు చేయగా రూ.2.50 లక్షలకు ఎలాంటి బిల్లులు, రసీదులు లేకుండా తీసుకెళుతుండడంతో సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 11:44 PM