Share News

ఢిల్లీ వెళ్లాలంటే ఏదో ఫ్లైట్‌ చూసుకోవాలి

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:41 AM

మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్‌ సాధిస్తా. ఢిల్లీ వెళ్లడం ఖాయం. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్‌ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి. ఏ ఫ్లైట్‌ ఖాళీ లేకపోతే ప్రైవేట్‌ జెట్‌లో అయినా వెళ్లాలి.’’

ఢిల్లీ వెళ్లాలంటే ఏదో ఫ్లైట్‌ చూసుకోవాలి

నన్ను బాబు వద్దనుకున్నారు.. నేను కాదు: కేశినేని

విజయవాడ జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్‌ సాధిస్తా. ఢిల్లీ వెళ్లడం ఖాయం. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్‌ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి. ఏ ఫ్లైట్‌ ఖాళీ లేకపోతే ప్రైవేట్‌ జెట్‌లో అయినా వెళ్లాలి.’’ అం టూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇం కా మంచి పదవిలో ఉండేవాడినన్నారు. ‘‘నన్ను వద్దని చంద్రబాబు అనుకున్నారు. నేను అనుకోలేదు. విజయవాడ ప్రజల పై నాకు నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నా గెలుస్తానని గతంలోనే చెప్పా. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చే శా. అటువంటి నేను ఖాళీగా అంటే అభిమానులు, కార్యకర్త లు ఊరుకుంటారా?’’ అని నాని అన్నారు. ‘‘ఫేస్‌బుక్‌ పోస్టు లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా. అంతకుమించి కొత్త గా చెప్పేదేమీ లేదు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానని స్పష్టంగా ఫేస్‌బుక్‌లో పెట్టా. మీడియాకు కావాల్సింది మసాలేగా. త్వరలోనే ఆ మ సాలా ఉంటుంది. తినబోతూ రుచులెందుకు.. అన్ని విషయా లు ఒకే రోజెందుకు?’’ అని అన్నారు. ‘‘ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్‌ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండికి కరెక్ట్‌ కాకపోవచ్చు. ఇది ఎవరికి ఎలా అర్థమైతే అలా రాసుకోండి.’’ అని వ్యాఖ్యానించారు. మీడియాను పట్టించుకోవటం ఎప్పుడో మానేశానన్నారు. ‘‘2024, మే వరకు నేనే విజయవాడ ఎంపీ ని. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు. గొడవలు పడటం నా నైజం కాదు, అంతమాత్రాన అది చేతకానితనం కాదు’’ అని కేశినేని నాని పేర్కొన్నారు. ‘‘జనవరి 4న ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురాం నన్ను కలిశారు. తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌చార్జిగా నియమించారు. కాబట్టి నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పారని తెలిపారు’’ అని ఫేస్‌బుక్‌ పోస్టులో విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 06:56 AM