Share News

స్పందించకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:34 PM

ములకలచెరు వు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్రమా దం పొంచి ఉంది.

స్పందించకుంటే  మూల్యం చెల్లించుకోక తప్పదు
ప్రమాదకరంగా ఉన్న ట్రాన్సఫారం చేతికందే ఎత్తులో విద్యుత తీగలు

ములకలచెరువు మార్కెట్‌ యార్డులో పొంచి ఉన్న ప్రమాదం

ములకలచెరువు, ఆగస్టు 24: ములకలచెరు వు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్రమా దం పొంచి ఉంది. సకాలంలో స్పందించ కుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్ప దు. మార్కెట్‌ యార్డులోని ఓ మండీ ముం దు ట్రాన్సఫార్మర్‌, చేతికందే ఎత్తులో విద్యుత తీగలు ఉన్నాయి. దీంతో రైతులు, వ్యార స్థులు, కూలీలు, వాహనాలతో నిత్యం కళకళ లాడే మార్కెట్‌ యార్డులో ఎప్పుడైనా ప్రమా దం జరిగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ట్రాన్సఫార్మర్‌, విద్యుత తీగలు కనపపడకపో వడంతో టమోటాలు తీసుకొచ్చే వాహనాలు వాటికి తగిలే అవకాశం ఉంది. ఈ విషయమై ట్రాన్స కో అధిరులకు ఎన్ని సార్టు విన్నవించినా ప్రయో జనం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఎలాం టి ప్రమాదం జరక్క ముందే ట్రాన్సఫార్మర్‌ను జన సంచారం లేని ప్రాంతంలో ఏర్పాటు చేసి చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత తీగలు సరిచేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:34 PM