Share News

జగన్‌ కొనసాగితే ఉద్యోగులకు తిప్పలే

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:39 AM

జగన్‌ ఇంకా అధికారంలో కొనసాగితే ఉద్యోగులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థ నాశనమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25వేల కోట్ల మేర బకాయిలు పెట్టారు.

జగన్‌ కొనసాగితే ఉద్యోగులకు తిప్పలే

ఇప్పటికే సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థ నాశనమైపోయింది

ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అవన్నీ చెల్లిస్తాం

ప్రతినెలా 1నే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటాం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీలు

మంగళగిరి, ఏప్రిల్‌ 6: ‘జగన్‌ ఇంకా అధికారంలో కొనసాగితే ఉద్యోగులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థ నాశనమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25వేల కోట్ల మేర బకాయిలు పెట్టారు. ఇదిలాగే కొనసాగితే ఉద్యోగుల భవిష్యత్తు ఏమవుతుందో’’ అని టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శనివా రం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పూర్ణిమా అపార్టుమెంట్‌ వాసులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలను ఏడాదిలోగా చెల్లిస్తామని, గ తంలో మాదిరి ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.

అడ్డగోలు సంపాదనపైనే శ్రద్ధ

సీఎం జగన్‌, ఆయన మంత్రివర్గ సహచరులకు అడ్డగోలు సంపాదనపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధ లేదని లోకేశ్‌ విమర్శించారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని అడిగి తే కోడిగుడ్డు కఽథలు చెబుతున్నారని, ఇటువంటి పనికిమాలి న మంత్రులుంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు దూరదృష్టిని, విజన్‌ను కొందరు పనిగట్టుకుని విమర్శిస్తుంటారని చెబుతూ గతంలో 5వేల ఎకరాల్లో శంషాబాద్‌ విమానాశ్రయం కడతానంటే అంత భూమి ఎందుకన్నారని ప్రశ్నించిన వారు చాలమంది ఉన్నారని గుర్తుచేశారు. జగన్‌ ఐదేళ్లలో తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచినా కరెంటు కోతలు మాత్రం తప్పడం లేదంటూ హేళన చేశారు(సరిగ్గా ఇదే సమయంలో కరెంటు పోవడంతో అపార్టుమెంట్‌వాసుల నుంచి మంచి స్పందన కనపించింది). టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా చార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్‌ను అందజేశామని చెప్పారు. కనీసం కరెంటు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసి ఏ పరిశ్రమలైనా ఎందుకొస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక టెస్లా వంటి ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి రప్పించి యువతకు ఉద్యోగ కల్పన చేసి తీరుతామని చెప్పారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని 3 ముక్కలాటతో రాష్ట్రానికి జగన్‌ అన్యాయం చేశారని అన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:39 AM