Share News

ఒక్క చాన్స్‌ ఇస్తే అథఃపాతాళానికి తొక్కేశాడు

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:09 AM

ఒక్క చాన్స్‌.. ఒక్క చాన్స్‌.. అన్న జగన్‌ మాయలో పడి వైసీపీని గెలిపించినందుకు 5 కోట్ల మంది ప్రజానీకం పెనుమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఒక్క చాన్స్‌ ఇస్తే అథఃపాతాళానికి తొక్కేశాడు

జగన్‌ దెబ్బకు పరిశ్రమలు పరార్‌

అమరరాజా తెలంగాణకు పోయింది

భారత్‌ బయోటెక్స్‌ ఒడిశాకు వెళ్లింది

ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన

విధ్వంసం కొనసాగుతూనే ఉంది

వ్యవస్థలను సర్వ నాశనం చేశారు

రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే

చంద్రబాబు పగ్గాలు చేపట్టాల్సిందే

వైసీపీ అరాచకాలకు చెక్‌ పెట్టండి..

ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి

‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమంలో

టీడీపీ నేత నారా లోకేశ్‌ పిలుపు

మంగళగిరి, మార్చి 20: ‘‘ఒక్క చాన్స్‌.. ఒక్క చాన్స్‌.. అన్న జగన్‌ మాయలో పడి వైసీపీని గెలిపించినందుకు 5 కోట్ల మంది ప్రజానీకం పెనుమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అథఃపాతాళానికి తొక్కేశాడు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన మంగళగిరి నియోజక వర్గం పరిధిలోని కుంచనపల్లి అపర్ణ అపార్టుమెంట్స్‌ వాసులతో కలిసి ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ అరాచకపాలనతో ఏపీ బ్రాండ్‌ నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘జే ట్యాక్స్‌, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే అమర్‌రాజా వంటి ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జగన్‌ దెబ్బకు ఏపీలో తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతామనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు వచ్చారు. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో వాక్సిన్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న భారత్‌ బయోటెక్‌ సంస్థ ఏపీని కాదని ఒడిశాలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని అందించే అమర్‌రాజాను వేధించడంతో ఆ కంపెనీ యాజమాన్యం తెలంగాణకు వెళ్లిపోయింది. వీటివల్ల అంతిమంగా నష్టపోయింది నిరుద్యోగ యువతే. రాష్ట్ర ప్రజలు వీటన్నింటినీ గమనంలో ఉంచుకుని అరాచక విధానాలకు చెక్‌ పెట్టేలా ఆలోచించి ఓటెయ్యాలి’’ అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ప్రగతి ఇదీ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చారని నారా లోకేశ్‌ తెలిపారు. ఒక్కొక్క జిల్లానూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారన్నారు. అనంతపురంలో ఆటోమొబైల్‌, చిత్తూరులో ఎలకా్ట్రనిక్స్‌, కర్నూలులో సోలార్‌ ఎనర్జీ, విశాఖలో ఐటీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పామాయిల్‌ రంగాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో 40 వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్‌ ప్రభుత్వమే చెప్పిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలన్నది టీడీపీ ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. ‘‘అభివృద్ధి చేయకుండా ఎడాపెడా అప్పులు చేస్తూ పోతే ఆ భారమంతా అంతిమంగా రాష్ట్ర ప్రజలే మోయాలి. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతు ఇదే. సంక్షోభాలను సవాల్‌గా స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.’’ అని లోకేశ్‌ చెప్పారు.

మాఫియా లేకుంటే పెద్దిరెడ్డికి ఓటమే: అచ్చెన్నాయుడు

అమరావతి: ‘మాఫియాతో పొత్తు లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడలేరు. స్వేచ్ఛగా పోలింగ్‌ జరిగితే పుంగనూరులో ఓడిపోతారు. అలాంటి పెద్దిరెడ్డి, చంద్రబాబుపై అహంకారపూరితంగా నోరు పారేసుకుంటారా?’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ పెద్దిరెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటు గా స్పందించారు. ‘పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించారు. వారి కుటుంబాల చేతిలో పెద్దిరెడ్డి ఏదో ఒకరోజు వికలాంగుడౌతారు. అతని అం తరాత్మ అదే చెపుతున్నట్లుం ది. అందుకే పెద్దిరెడ్డి తన స్థితిని చంద్రబాబుకు అంటకట్టి నోరుపారేసుకుంటున్నా రు.’ అని అచ్చెన్న ఆగ్రహించారు.

లోకేశ్‌ కాన్వాయ్‌ తనిఖీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేశ్‌ బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతూ కరకట్ట రోడ్డు ఎక్కగానే పోలీసులు ఆయన కాన్వాయ్‌ను నిలిపివేశారు. కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఆయన కాన్వాయ్‌ని ఆపించి అన్ని వాహనాలను చెక్‌ చేసుకోవచ్చునంటూ సహకరించారు.

Updated Date - Mar 21 , 2024 | 03:10 AM