Share News

రాజకీయాలకు సెలవు: ఇంతియాజ్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:57 AM

‘నేను రాజకీ యాల నుంచి వైదొలుగుతున్నా. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతా’ అని మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు.

రాజకీయాలకు సెలవు: ఇంతియాజ్‌

విజయవాడ (పటమట), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘నేను రాజకీ యాల నుంచి వైదొలుగుతున్నా. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతా’ అని మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. విజయవాడలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఐఏఎస్‌ సర్వీస్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీ యాల్లోకి వచ్చాను. కర్నూల్‌ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఫలితాలు అందరికీ తెలుసు. గత కొంత కాలంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. రాబోయే రోజుల్లో సామాజిక అసమానతలను, రుగ్మతలను రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా’ అని ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 05:57 AM