Share News

ఏపీకి ఐఏఎస్‌ కృష్ణతేజ.. వచ్చే వారంలో రాక

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:14 AM

కేరళ ఐఏఎస్‌ అధికారి వీఆర్‌ కృష్ణతేజ ఏపీకి వచ్చేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఆయనను ఏపీకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఏపీకి ఐఏఎస్‌ కృష్ణతేజ.. వచ్చే వారంలో రాక

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): కేరళ ఐఏఎస్‌ అధికారి వీఆర్‌ కృష్ణతేజ ఏపీకి వచ్చేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు ఆయనను ఏపీకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం ఆయనను ఏపీకి పంపించేందుకు ఎన్‌వోసీ ఇచ్చింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు ఆయనను స్టేట్‌ డిప్యుటేషన్‌ కింద ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం అపాయింట్‌మెంట్స్‌ కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. తొలి విడతలో మూడేళ్ల పాటు ఆయన ఏపీలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. వచ్చే వారంలో ఆయన ఏపీలో రిపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చూస్తున్న శాఖల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 07:11 AM