ఐఏఎస్, ఐపీఎస్ లు ఇక పద్ధతులు మార్చుకోవాలి: ఆనం రమణారెడ్డి
ABN , Publish Date - Mar 17 , 2024 | 03:32 AM
జగన్‌రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. ‘
జగన్‌రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. ‘కోడ్ రావడంతో అధికారులు భయపడుతున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎ్‌సలు ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఢిల్లీ వెళ్లొచ్చని అనుకుంటున్నారేమో.. ఢిల్లీలోనూ వచ్చేది మా ఉమ్మడి ప్రభుత్వమే. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోకపోతే తీవ్ర చర్యలుంటాయి. లోకేశ్‌ను సవాల్ చేసే స్థాయి అనిల్‌కుమార్ యాదవ్‌కు లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. లోకేశ్ ఎందుకు... నాతో చర్చకు సిద్ధమా? రోజాకు టికెట్ ఇచ్చిన జగన్‌కు ధన్యవాదాలు. రోజాను చిత్తుగా ఓడించడానికి నగరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నగరి టీడీపీ అభ్యర్థి 50వేల మెజార్టీతో గెలుస్తాడు’ అని ఆనం అన్నారు.