Share News

Uppada: కాకినాడలో అల్లకల్లోలంగా మారిన సముద్రం

ABN , Publish Date - May 25 , 2024 | 05:30 PM

కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

Uppada: కాకినాడలో అల్లకల్లోలంగా మారిన సముద్రం

కాకినాడ, మే 25: కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ అలల ఉదృతికి బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రహదారిపై వాహనదారులను సైతం ఈ అలలు ముంచెత్తున్నాయి. ఇక సముద్రంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం, అలాగే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.


మరోవైపు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం వాయుగుండంగా మారింది. శనివారం సాయంత్రానికి తుపాన్‌గా బలపడనుంది. ప్రస్తుతం ఈశాన్య దిశగా ఈ తుపాను కదులుతుంది. ఇది పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌కు 380 కిలో మీటర్లు.. బంగ్లాదేశ్‌కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Updated Date - May 25 , 2024 | 05:30 PM