Share News

బళ్లారిలో భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:03 AM

కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగరంలోని పూల మార్కెట్‌ సమీపంలో ఉన్న బంగారం దుకాణం యజమాని ఇంట్లో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించి, భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.

బళ్లారిలో భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం

హవాలా దందా నడుపుతున్న వ్యాపారి ఇంట్లో పోలీసుల సోదాలు

5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 130 కిలోల వెండి పట్టివేత

బళ్లారిరూరల్‌, ఏప్రిల్‌ 7: కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగరంలోని పూల మార్కెట్‌ సమీపంలో ఉన్న బంగారం దుకాణం యజమాని ఇంట్లో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించి, భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి డీఎస్పీ చంద్రకాంత్‌నందరెడ్డి, సీఐ సింధూర్‌ నేతృత్వంలో పూలమార్కెట్‌ వద్ద ఉన్న హేమా జ్యువెలర్స్‌ యజమాని నరేష్‌ సోనీ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.60 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం బిస్కెట్లు, 130 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి ఎస్పీ రంజిత్‌కుమార్‌ భండారి మీడియాతో మాట్లాడుతూ.. నరేష్‌ సోనీ హవాలా దందా నడుపుతున్నట్టు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 04:03 AM