పేదలకు వెంటనే ఇంటిపట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:52 PM
పేద లకు ఇంటి పట్టాలు, పక్కా గృహాలను మంజూరు చేయా లంటూ బి.కొత్తకోట నగర పం చాయతీ పరిధిలోని పేదలు ప్రభుత్వాన్ని కోరారు.
బి.కొత్తకోట, నవంబరు 25: పేద లకు ఇంటి పట్టాలు, పక్కా గృహాలను మంజూరు చేయా లంటూ బి.కొత్తకోట నగర పం చాయతీ పరిధిలోని పేదలు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద వందలాది మంది పేదలు మహాధర్నా నిర్వ హించారు. భారత కమ్యూనిస్ట్‌పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రకమిటీల పిలుపు మేరకు ఆయా నాయకులు క్రిష్నప్ప, మనోహర్‌రెడ్డిల నేతృత్వంలో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఒకరోజు ముందుగా ఈ ధర్నాపై పట్ట ణంలో ప్రచారం నిర్వహించడంతో పెద్దఎత్తున పేదలు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ గత ప్రభు త్వంలో పేదలను పట్టాల పేరుతో మోసం చేశారని, ఈ కూటమి ప్రభు త్వంలో అయినా పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 అర్జీలను తహశీల్దార్ కార్యాల యంలో అందజేశారు. పట్టణప్రాంతంలో 1.5 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌వ్యయంతో పాటు, రూ.4 లక్షల రుణంగా ఇప్పిం చాలని తహశీల్దార్ మహమ్మద్‌అన్సారీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బషీర్‌ఖాన, రఘునాథ్, షమీవుల్లా, తంబయ్య, నారాణ స్వామి, బాబు, బావాజాన, రామచంద్రలతో పాటు మహిళలు పాల్గొన్నారు.