Share News

మండుతున్న పచ్చి మిర్చి

ABN , Publish Date - May 17 , 2024 | 12:04 AM

పచ్చిమిర్చి ధరలు మండుతున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.40-రూ.50 పలికిన ధర, ఇటీవల భారీగా పెరిగింది.

మండుతున్న పచ్చి మిర్చి

ఫ కిలో రూ.120

ఆదోని, మే 16: పచ్చిమిర్చి ధరలు మండుతున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.40-రూ.50 పలికిన ధర, ఇటీవల భారీగా పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.120 వరకు పలుకుతోంది. సూపర్‌మార్కెట్లు, ఆన్‌లైన్‌ యాప్స్‌లో ఈ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఆదోని రైతుబజారులో గురువారం కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయించారు. వేసవి ప్రభావంతో పచ్చిమిర్చి సాగు తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:04 AM