హమ్మయ్య, ఇక ఊరు వెళతాం
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:06 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యాల కారణంగా 25 రోజులుగా ఊరిని,

కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యాలతో కుటుంబాలు వదిలి తిరుగుతున్నాం
దుర్గమ్మను దర్శించుకున్న తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు
విజయవాడ(వన్‌టౌన్), జూన్ 6 : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యాల కారణంగా 25 రోజులుగా ఊరిని, కుటుంబసభ్యులను విడిచి బయట వేరే ప్రాంతంలో తిరుగుతున్నామని తాడిపత్రికి చెందిన నలుగురు కౌన్సిలర్‌లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి రావడంతో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని సొంతూరు తాడిపత్రి వెళుతున్నట్టు వారు తెలిపారు. తాడిపత్రి 32వ వార్డు కౌన్సిలర్ మంగపట్నం లక్ష్మీనారాయణ, 30వ వార్డు కౌన్సిలర్ విజయకుమార్, 26వ వార్డు కౌన్సిలర్ షేక్ వలీ, 15వ వార్డు కౌన్సిలర్ రామచంద్ గురువారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని, అన్యాయంగా టీడీపీ కౌన్సిలర్‌లు, నాయకులపై కేసులు పెట్టించారని వాపోయారు.