సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన హైకోర్టు
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:26 AM
2025 సంవత్సరానికి హైకోర్టు, జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్ కోర్టులకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు.
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): 2025 సంవత్సరానికి హైకోర్టు, జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్ కోర్టులకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. 2025లో మొత్తం 26 సాధారణ సెలవులు, 13 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. జనవరి 13 నుంచి 17వరకు సంక్రాంతి సెలవులు, మే 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు, సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు.