Share News

హీరోలు.. విలన్‌!

ABN , Publish Date - May 03 , 2024 | 02:46 AM

'నేను రియల్‌ హీరోను’ అన్నట్టు జగన్‌ కొత్తగా బిల్డప్‌ ఇస్తున్నారు. రియల్‌ హీరో అంటే... ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. రాష్ట్రానికి మేలు చేసే వాళ్లకు మర్యాదలు చేయాలి.

హీరోలు.. విలన్‌!

'నేను రియల్‌ హీరోను’ అన్నట్టు జగన్‌ కొత్తగా బిల్డప్‌ ఇస్తున్నారు. రియల్‌ హీరో అంటే... ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. రాష్ట్రానికి మేలు చేసే వాళ్లకు మర్యాదలు చేయాలి.

కానీ... జగన్‌ తీరే వేరు. టాలీవుడ్‌ అగ్రనటులను కేవలం ‘అవమానించేందుకే’ తన ఇంటికి పిలిపించారు. సినిమా టికెట్ల ధర విషయంలో లేని వివాదాన్ని సృష్టించి.. కావాలనే సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టారు. ‘నేను తలచుకుంటే మిమ్మల్ని రప్పించగలను’ అన్నట్లుగా హీరోలను తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసుకు రప్పించారు. ఉద్దేశపూర్వకంగానే వారి వాహనాలను గేటు వద్ద ఆపించి..

నడిపించారు. వారు కేవలం హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాదు. మొత్తం సినీ పరిశ్రమకు ప్రతినిధులు! రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధికి వారి సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. కానీ... జగన్‌ కేవలం తన ఇగో చల్లార్చుకోడానికే వారిని పిలిపించి అవమానించారనే విమర్శలు వచ్చాయి.

Updated Date - May 03 , 2024 | 02:46 AM